ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఎస్సై... తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి గుంటూరు గ్రామీణ ఎస్పీని ఆశ్రయించింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ఆ యువతి.. విజయవాడలో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సర్కిల్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కూరపాటి నాగేంద్రకు ఫేస్బుక్లో పరిచయమైనట్టు ఆమె తెలిపింది. తర్వాత ఫోన్ నెంబర్లు తీసుకొని తరుచూ మాట్లాడుకునేవాళ్లమని చెప్పింది. ఓరోజు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని అడగ్గా... బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. జిల్లా గ్రామీణ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు.
ఎస్సై మోసం చేశాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు యువతి ఫిర్యాదు - నమ్మంచి ఎస్సైమోసం
గుంటూరు జిల్లాలో ఓ యువతి.. తనను ఎస్సై మోసం చేశాడని ఆరోపించింది. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.
ఎస్సై మోసం చేశాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు యువతి ఫిర్యాదు
Last Updated : Feb 10, 2020, 11:52 PM IST