ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUSPEND: రెవెన్యూ ఉద్యోగుల్లో సస్పెన్షన్​ కలవరం...ఎందుకంటే..

By

Published : Sep 22, 2021, 9:56 PM IST

Updated : Sep 22, 2021, 10:54 PM IST

NOTICES TO TAHSILDARS
NOTICES TO TAHSILDARS

21:53 September 22

NOTICES TO TAHSILDARS OF GUNTUR DISTRICT


గుంటూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఒకేసారి 13 మంది తహసీల్దార్లకు షోకాజు నోటీసులు జారీ(NOTICES TO TAHSILDARS OF GUNTUR DISTRICT) చేయటంతో పాటుగా, 12 మంది గ్రామ రెవెన్యూ అధికారులను సస్పెండ్‌(SUSPEND) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

స్పందన అర్జీలు, ప్రజలు రెవెన్యూ సర్వీసుల కోసం అందించిన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని కలెక్టర్‌ వారిని సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయాల తనిఖీల్లో రెవెన్యూ సేవలు పెండింగ్​, పరిష్కరిస్తున్న వారి పనితీరు మెరుగుపర్చుకోవాలని తగినంత సమయం ఇచ్చి, వీడియో కాన్ఫరెన్స్ లు, టెలికాన్ఫరెన్స్ ల ద్వారా పదేపదే సూచనలు ఇచ్చినప్పటీకీ, రెవెన్యూ సేవల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

అధికారులపై తీసుకున్న చర్యలతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏకకాలంలో ఇంతమందిపై చర్యలు తీసుకోవటం ఎన్నడూలేదని ఉద్యోగులు కలవరం చెందుతున్నారు. కలెక్టర్‌ ఉత్తర్వులు ప్రస్తుతం రెవెన్యూలోనే కాకుండా అన్ని శాఖల్లోని ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: 

KOPPARRU INCIDENT: 50మంది తెదేపా, 19మంది వైకాపాకు చెందినవారిపై కేసు

Last Updated : Sep 22, 2021, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details