ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమూల్ పాల సేకరణ చేయట్లేదని..12 మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

పంచాయతీ కార్యదర్శులకు గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి షోకాజు నోటీసులు జారీ చేశారు. అమూల్ పాల సేకరణ చేయట్లేదని. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని నోటీసులిచ్చారు.

show cause notice to panchayath secretaries
show cause notice to panchayath secretaries

By

Published : Oct 7, 2021, 7:04 AM IST

Updated : Oct 7, 2021, 12:13 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌లో ఏకంగా 12 మంది పంచాయతీ కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి ఆర్​. కేశవరెడ్డి షోకాజు నోటీసులను జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమూల్ పాలసేకరణ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వహించారని వారికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకుగాను ఏడురోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో సూచించారు.

గ్రామాల్లో రైతుల నుంచి పాలసేకరణ విషయంలో పంచాయతీలకు కార్యదర్శులే నోడల్ అధికారులు. అమూల్​కు పాలు పోసేలా ప్రజలను చైతన్య పరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన కార్యదర్శులకు ఇటీవల షోకాజు జారీ చేశారు.

Last Updated : Oct 7, 2021, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details