Beltshop Liquor Mafia in Guntur:బెల్టుషాపుతో ఇబ్బందులు పడుతున్నామని, మద్యం విక్రయించొద్దని కోరినందుకు ఓ వ్యక్తి.. సంబంధిత బెల్టు షాపు నిర్వాహకుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యాడు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. సీఎం నివాసానికి సమీపంలోి ఉన్న కత్తులపేటలో సుబ్బారావు అనే వ్యక్తి గత కొంతకాలంగా గొలుసు దుకాణం ద్వారా మద్యం విక్రయిస్తున్నాడు. దీని వల్ల తమ ఇంటికి వచ్చి మద్యం గురించి వాకబు చేస్తున్నారని, ఇది తమకు ఇబ్బందిగా ఉందని.. పొరుగున ఉన్న నాగరాజు కుటుంబం సబ్బారావుకు చెప్పారు. అయినా, వినకపోవడంతో.. మద్యం విక్రయాలపై నాగరాజు పెద్దకొడుకు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సుబ్బారావును పిలిచి మందలించారు.
బెల్టు షాపుతో ఇబ్బందిగా ఉందన్నందుకు కత్తితో పొడిచిన వ్యాపారి - గొలుసు దుకాణం
Liquor Mafia in AP: ఆ ప్రాంతంలో బెల్టు షాపు నిర్వహిస్తున్నాడు మద్యం వ్యాపారి. దాని వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ యువకుడు. పోలీసులు ఆ వ్యాపారిని మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు.. మళ్లీ ఫిర్యాదు చేసేందుకు బయలు దేరిన యువకుడి తండ్రితో ఘర్షణకు దిగిన మద్యం వ్యాపారి.. కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటన తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి సమీపంలో జరగడం గమనార్హం.
ఆ తర్వాత కూడా సుబ్బారావు పద్ధతి మార్చుకోలేదు. శుక్రవారం మళ్లీ నాగరాజు పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, అతని తల్లి పార్వతి గొడవలు వద్దంటూ ఇంటికి తీసుకొచ్చింది. అప్పటికే సుబ్బారావు, నాగరాజు కుటుంబంతో ఘర్షణకు దిగాడు. ఇంట్లో ఉన్న నాగరాజు తండ్రిని బయటకు తీసుకొచ్చి తన మేనమామ శ్రీనివాసరావుతో కలిసి సుబ్బారావు కొట్టాడు. ఆ తర్వాత కత్తితో పొడవడంతో పెద్దపేగు బయటికి వచ్చింది. నాగరాజు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.