కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు - కోటప్పకొండపై శివరాత్రి వేడుకలు
మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి తొలిపూజ మహోత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి వారికి తొలిపూజ మహోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. ఉదయం 2 గంటల నుంచే స్వామివారికి పలు అభిషేకాలు, పూజలు చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు బుధవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు బారులుతీరారు.