Mallikarjuna Swami Temple: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ భ్రమరాంభ సమేత మల్లిఖార్జునస్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రుద్రాక్ష మండపాన్ని ఏర్పాటు చేశారు. లక్ష రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై రుద్రాక్షలతో కూడిన శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పరమపవిత్రమైన కార్తీక మాసంలో రుద్రాక్షలకు పూజించటం శుభప్రదం కావటంతో ఇలా స్వామివారిని రుద్రాక్షలతో ఏర్పాటుచేసినట్లు పండితులు తెలిపారు.
కార్తీక మాసం ప్రత్యేక పూజలు.. గుంటూరులో లక్ష రుద్రాక్షలతో శివలింగం.. - Shivaling
Rudraksha Shivalinga: కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివారాధన చేస్తే శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ మాసం వచ్చిందంటే శివాలయాలు భక్తులతో నిండిపోతాయి. కార్తీక మాసం సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ భ్రమరాంభ సమేత మల్లిఖార్జునస్వామి ఆలయంలో కార్తీకమాస పూజలు ప్రారంభమయ్యాయి.
Etv Bharat