జీవితంలో అనుభవం సాధించిన పెద్దవారు చిన్నవారికి సలహాలు సూచనలు చేయడం కామన్ వాటిని కొందరు స్వీకరిస్తారు మరికొందరు లైట్ తీసుకుంటారు
అది వారి వారి పరిస్థితులు ఆలోచనా విధానంపై డిపెండ్ అవుతుంది
అయితే ఎవ్వరు చెప్పినా వినని వ్యక్తి ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోని ఆ వ్యక్తి మరొకరు చెబితే విన్నాడంటే వారి మధ్య అంతకు మించిన బాండింగ్ ఉందని అర్థం
అలాంటి బంధం చిరంజీవికి తనకు మధ్య ఉందని చెబుతున్నారు నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా
మెగాస్టార్ చిరంజీవి ఒక సూచన చేశారని దాన్ని 22 ఏళ్లుగా పాటిస్తూ దూరంగా ఉన్నాని చెప్పారు శివాజీ రాజా