అమరావతి రాజధాని కోసం కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్.మస్తాన్‌వలీ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు మూడు ముక్కలు చేయటం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కర్నూలు రాజధానిగా ఉందని, ఇప్పుడు రాయలసీమలో రాజధాని అని చెబుతున్న ప్రభుత్వం కోర్టు ముసుగులో అక్కడి ప్రజల్ని మోసం చేయబోతుందన్నారు. కోర్టును కర్నూలులో పెట్టి ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుందో చెప్పాలన్నారు. మూడు రాజధానులతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందన్న ఆయన చంద్రబాబు ఊతపదమైన తాత్కాలిక రాజధాని అనే మాట అమరావతి గొంతుకోసే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు.
"మూడు రాజధానులతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం" - capital news in ap
అమరావతి రాజధానికి కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలీ, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. వైకాపా ఎన్నికల సమయంలో అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు మూడు ముక్కలు చేయటం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్.మస్తాన్‌వలి,
రియల్ ఎస్టేట్ పేరుతో బ్రోచర్లు వేసుకుని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాజధానికి 5 నుంచి 10వేల ఎకరాలు సరిపోతుందని కాంగ్రెస్ తరపున చెప్పామన్నారు. కాదని 33వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు. అందుకు అప్పటి ప్రతిపక్షనేత జగన్ కూడా మద్దతిచ్చారన్నారు.
ఇవీ చదవండి