ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు గొర్రెలు మృతి.. జీవనాధారం లేదంటూ బాధితుడి ఆవేదన - today thunder lighting latest news udpate

పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా గ్రామంలో జరిగింది. గొర్రెలు మృతి చెందటం.. తన కుటుంబం జీవనాధారం కోల్పోయిందని బాధితుడు ఆందోళన చెందుతున్నాడు.

sheep were dead in the thunder lightning
పిడుగుపాటుకు గొర్రెలు మృతి

By

Published : Apr 19, 2021, 9:15 PM IST


గుంటూరు జిల్లా వినుకొండలో పిడుగుపాటుకు 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా గ్రామంలో చోటు చేసుకుంది. కమాసాని లక్ష్మయ్య రోజూలానే గొర్రెలను తీసుకొని.. సమీపంలోని పొలాల్లో మేపుతుండగా అకాల వర్షం కురిసింది. పిడుగు పడటంతో.. 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు లక్ష్మయ్య తెలిపారు. పిడుగు పడటం వలన ఈ ప్రమాదం సంభవించి.. తనకున్న పదిహేను గొర్రెలు మృతి చెందాయని రైతు వాపోయాడు.

తన కుటుంబానికి జీవనాధారమైన జీవాలు మృతితో.. 2లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని.. తన కుటుంబం జీవనాధారం కోల్పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

వైరస్ విస్తరిస్తున్నా... మాస్కును మరుస్తున్నారు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details