నిత్యం వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే శంకర్ విలాస్ వంతెనతో ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజు వాహనదారుల ప్రయాణాలు ఎక్కువకావడంతో.. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోతోంది. బ్రిడ్డి వెడల్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
' శంకర్ విలాస్ వంతెనను పొడగించండి' - గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సమస్య వార్తలు
గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ వంతెనకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చటంలో, ప్రజల దైనందిన వ్యవహారాలు చక్కబెట్టుకునే క్రమంలో రాకపోకల కోసం ఎంతగానో ఉపయోగపడింది. అయితే పెరిగిన వాహనాలతో ఇపుడు ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. దీంతో శంకర్ విలాస్ వంతెనగా పిలుచుకునే ఆ ఫ్లైఓవర్ పునర్ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది.
గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్