రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన సర్దుబాటు కౌన్సెలింగ్ ప్రక్రియను పలువురు ఉపాధ్యాయులు బహిష్కరించారు. కౌన్సెలింగ్ ప్రక్రియ చట్టబద్ధంగా జరగటం లేదని... తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియను ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. 507 జీవోను రద్దు చేసి చట్టబద్ధంగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ లేకుండా నిర్వహించిన పోస్టులను రద్దు చేయాలని కోరారు. సర్దుబాటు ప్రక్రియ సరిగా జరగటంలేదన్నారు.
సర్దుబాటు కౌన్సెలింగ్‌ను బహిష్కరించిన ఉపాధ్యాయులు
రాష్ట్ర పురపాలకశాఖ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో నిర్వహించిన సర్దుబాటు కౌన్సెలింగ్ ప్రక్రియను పలువురు ఉపాధ్యాయులు బహిష్కరించారు.
టీచర్లు