సమస్యలు పరిష్కరించాలంటూ గుంటూరు బాపట్ల పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అనంతరం బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థులంతా కలసి ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనీ... బీసీ, ఎస్సీ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్‌కి వినతి పత్రాన్ని సమర్పించారు.
సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ధర్నా - SFI DARNA FOR STUDENT PROBLEMS
మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలనీ, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
![సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4067289-546-4067289-1565174302690.jpg)
విద్యార్థలు సమస్యలు పరిష్కరించాలి..ఎస్ఎఫ్ఐ ధర్నా