లైంగిక వేధింపులే నేపథ్యంగా గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఒంటరిగా ఉన్న మహిళపై శ్రీను అనే యువకుడు దాడి చేయగా.. ఆమె తల, చేతిపై గాయాలయ్యాయి. బాధితురాలిని వైద్యచికిత్సల నిమిత్తం మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించనున్నారు. ఏడాది నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని... నిరాకరించినందుకు ఆమెపై గొడ్డలితో దాడి చేశాడని ఆమె బంధువులు వాపోయారు.
మహిళపై యువకుడు గొడ్డలితో దాడి... - గుంటూరులో మహిళపై దాడి వార్తలు
ఓ యువకుడు ఓ మహిళను లైగింక వేధించటమే కాకుండా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో జరిగింది.తీవ్రగాయలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లైంగిక వేధింపులతో... మహిళపై యువకుడు గొడ్డలితో దాడి