ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ, హరియాణా రాష్ట్రాలకు చెందిన మద్యం అక్రమ నిల్వలు పట్టివేత

పురపాలక ఎన్నికల సమయంలో విక్రయించేందుకు తెలంగాణ, హరియాణాల నుంచి అక్రమంగా తెప్పించి నిల్వ ఉంచిన మద్యాన్ని.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొప్పూడికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇందుకు పాల్పడగా.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరావు వెల్లడించారు.

police caught lakhs worth illegal liquor at boppudi
తెలంగాణ, హర్యానాలకు చెందిన 73 కేసుల మద్యం పట్టివేత

By

Published : Mar 7, 2021, 4:41 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో పశువుల కొట్టంలో అక్రమంగా నిల్వ ఉంచిన.. 3,503 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ, హరియాణాకు చెందిన వీటి విలువ రూ. 6.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పురపాలక ఎన్నికలు జరగనుండగా.. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా విక్రయించేందుకు సరుకు తెప్పించినట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు తెలిపారు.

గ్రామంలో అక్రమంగా మ‌ద్యం నిల్వ‌ ఉంచారన్న స‌మాచారంతో.. దాడులు నిర్వ‌హించినట్లు పోలీసులు వెల్లడించారు. 73 కేసుల్లో 3,503 క్వార్టర్ బాటిల్స్ ఉన్న‌ట్లు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వీటిలో 66 కేసులు హరియాణా, మిగిలిన 7 తెలంగాణకు చెందినవని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details