గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వసతి గృహంలో ఉంటున్న ఏడుగురు అనాథ బాలురకు, నిర్వాహకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తొలుత నిర్వాహకుని సోదరి కొవిడ్ బారిన పడ్డారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా నిర్వాహకునితో పాటు కుటుంబ సభ్యులు, వసతి గృహంలో ఉంటున్న బాలురకు వైరస్ సోకింది. వసతి గృహం నుంచి పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీపావళి పండగకు ముందు వరుసగా రెండ్రోజులు బాపట్లలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగాయి. పట్టణంలో గురువారం 14, శుక్రవారం 16 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
బాపట్లలోని వసతి గృహంలో కరోనా కలకలం - guntur corona cases
బాపట్లలోని ఓ వసతి గృహంలో కరోనా కలకలం రేపింది. ఏడుగురు అనాథ బాలురు, నిర్వాహకుడు వైరస్ బారిన పడ్డారు. వారిని ఆస్పత్రికి తరిలించి...చికిత్స అందిస్తున్నారు.
వసతి గృహంలో కరోనా కలకలం