బస్టాండ్ల వద్ద ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యులు గల ముఠాను గుంటూరు లాలాపేట పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి లక్షా 25 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు బస్టాండ్ నుంచి గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను మభ్యపెట్టి వారితోపాటు నిందితులు ఆటోలో ప్రయాణించి మార్గమధ్యలో వారి సొమ్ము, వస్తువుల్ని అపహరిస్తున్నారని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వివరించారు. ఇలాంటి చోరీలకు అవకాశమివ్వకుండా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని.. ఏమాత్రం అనుమానం వచ్చినా 100, 112 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. అన్ని ఆటోల్లోనూ పోలీసుల నంబర్లతో కూడిన స్టిక్కర్లను అంటించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.
ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీ.. ఏడుగురు అరెస్టు - గుంటూరులో దొంగల ముఠా అరెస్టు
ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుంటూరు లాలాపేట పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్షా 25 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీలు