గుంటూరు నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏడు ఇళ్లు కుప్పకూలిపోయాయి. గుంటూరు కొత్తపేట రామిరెడ్డి తోట 5లైన్లో ఇళ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఇళ్ల పక్కనే నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ కోసం సమాంతరంగా పునాదుల తవ్వారని..., దానివల్ల ఇళ్లకు కొద్దిపాటి గట్టు మిగిలిందని వారన్నారు. రాత్రి వర్షానికి ఆ మట్టి జారిపోయి ఇళ్లు కూలిపోయాయని బాధితులు తెలిపారు.
గుంటూరు నగరంలో భారీ వర్షం.. ఏడు ఇళ్లు నేలమట్టం... - గుంటూరులో కూలిన ఇళ్లుల వార్తలు
గుంటూరు నగరం కొత్తపేట రామిరెడ్డితోటలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏడు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్ల పక్కనే నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ వల్లే ఇలా జరిగిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లకు సమాంతరంగా పునాదుల తవ్వడంతోనే.. ఇళ్ల మధ్య ఉన్న గట్టు మట్టి వర్షానికి జారిపోయి అవి కూలాయని వాపోయారు.
ఇల్లు పడిపోవడంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడిపామన్నారు. ఇంట్లోని సామాన్లు అన్ని ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే ప్రాంతంలో పక్కనే మరో 3 ఇళ్లు కుప్పకులిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే తెల్లవారు జామున వచ్చిన మున్సిపల్ అధికారులు పరిశీలించి ...నో ఎంట్రీ బోర్డులు పెట్టి వెళ్లారని తమకు ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.తేదేపా పోరాటాన్ని ఆపటం జగన్ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు: బచ్చుల అర్జునుడు