ఒక్క కేసు కూడా లేని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మూడు రోజుల వ్యవధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. దాచేపల్లి నుంచి పిడుగురాళ్ల అత్తారింటికి వచ్చిన ఓ వ్యక్తి గత నెలలో పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం హైదరాబాదు నుంచి వచ్చిన వ్యక్తికి, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇద్దరికి, ఓ దుకాణపు యజమానికి, ఆర్టీసీ బస్టాండ్లో మెకానిక్కు కోవిడ్ నిర్ధరణ అయ్యింది. 7 కేసులలో 4 కేసులు హైదరాబాద్ నుంచి వచ్చినవని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాలలో రసాయనాల పిచికారీ చేయిస్తున్నారు.
పిడుగురాళ్లలో... మూడు రోజులవ్యవధిలో ఏడు కేసులు - పిడుగురాళ్లలో కరోనా తాజా వార్తలు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క కేసు కూడా లేని పిడుగురాళ్లలో మూడు రోజుల వ్యవధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. వీటిలో 4 కరోనా కేసులు హైదరాబాద్ నుంచి వచ్చినవే.
పిడుగురాళ్లలో కరోనా కేసులు