ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తాం: సీఎస్​ జవహర్‌రెడ్డి - new chief secretary in ap

CS JAWAHAR REDDY: ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి జవహర్​రెడ్డికి సమీర్​శర్మ బాధ్యతలు అప్పగించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో జవహర్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

CS JAWAHAR REDDY
CS JAWAHAR REDDY

By

Published : Nov 30, 2022, 1:30 PM IST

Updated : Nov 30, 2022, 8:37 PM IST

NEW CS JAWAHAR REDDY : ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తానని,.. పల్లెపల్లెకు, ప్రతి పౌరుడికి పాలనా ఫలాలు అందించేందుకు కృషి చేస్తానని కొత్తగా నియమితులైన జవహర్​రెడ్డి అన్నారు. సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం ఈరోజు సాయంత్రం 4గంటలకు ముగియడంతో.. జవహర్​రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డికి సచివాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్​ 1న జవహర్​రెడ్డి బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా.. ముహూర్తం బాగుండటంతో సచివాలయం మొదటి బ్లాక్‌లో ఈరోజే బాధ్యతలు చేపట్టారు.

ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తాం
Last Updated : Nov 30, 2022, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details