ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో సెమీ క్రిస్మమ్ వేడుకలు... పాల్గొన్న హోంమంత్రి - devotional news at guntur

పెదనందిపాడులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైకాపా పాలనలో దళితులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి పట్టం కట్టారని ఆమె కొనియాడారు.

semi Christmas celebrations in guntur
సభలో మాట్లాడిన హోంమంత్రి

By

Published : Dec 22, 2019, 1:05 PM IST

గుంటూరులో సెమీ క్రిస్మమ్ వేడుకలు... పాల్గొన్న హోంమంత్రి

గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడిన ఆమె... రాష్ట్రంలో కీలక పదవులు దళితులకు ఇచ్చిన ఘనత జగన్ మోహన్​ రెడ్డికే దక్కిందని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తీసుకొచ్చిన 'దిశ' చట్టంలో తనకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details