కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని రావిపాడు గ్రామంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు...144 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత - నరసరావుపేటలో మద్యం పట్టివేత
రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కులు నూతన విధానానికి తెర లేపారు. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి అధిక ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటన్నారు. తాజాగా గుంటూరు జిల్లా రావిపాడులో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత