ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 28 టన్నుల ఇసుక పట్టివేత

అక్రమ ఇసుక రవాణాపై గుంటూరు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు నిఘా పెంచారు. ప్రకాశం జిల్లా నుంచి వినుకొండకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 28 టన్నుల ఇసుకను ఉప్పలపాడు వద్ద స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

By

Published : Nov 26, 2020, 9:46 PM IST

sand seized
ఇసుక ట్రాక్కు పట్టివేత

గుంటూరు జిల్లా ఉప్పలపాడు వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చోదకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా ఉమా మహేశ్వరపురం నుంచి గుంటూరులోని వినుకొండకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉప్పలపాడు వద్ద వాహనాన్ని ఆపి ఇసుక స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వెంకట సత్యనారాయణ రెడ్డి అదుపులోకి తీసుకుని, కేసునమోదు చేశారు. అనంతరం అతన్ని ఐనవోలు పోలీసులకు అప్పగించినట్లు ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పట్టుబడిన ఇసుక సుమారు 28 టన్నులు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details