తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని గుంటూరు గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా నుంచి గుంటూరుకి మద్యాన్ని తరలిస్తున్న సమయంలో దాచేపల్లి చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. నిందితులు తండా హాసన్, నాగుల్ షరీఫ్, కరువది హుస్సేన్, కేశవబోయిన బసవ లింగయ్యపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.7.50 లక్షల విలువ చేసే 4,720 సీసాల మద్యాన్ని, రెండు లారీలను, కారును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక సరఫరా, రవాణా చేసే వారిపై నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు.
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం - గుంటూరులో అక్రమ మద్యం పట్టివేత
తెలంగాణ నుంచి అక్రమంగా రాష్ట్రానికి రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు. 4వేల 720 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు లారీలు, కారుతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Seizure of liquor