ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యడ్లపాడులో తెలంగాణ మద్యం స్వాధీనం..ముగ్గురు అరెస్ట్​ - గుంటూరులో అక్రమంగా తెలంగాణ మద్యం నిల్వలు

తెలంగాణ నుంచి ఏపీ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా రోజురోజుకీ పెరిగిపోతోంది. గుంటూరు జిల్లా యడ్లపాడులో ఈ రోజు ఉదయం ఓ ఇంట్లో పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని గుర్తించారు. 668 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Seizure of illegally
Seizure of illegally

By

Published : Oct 2, 2020, 9:46 AM IST

గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడులో శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. 668 మద్యం సీసాలను చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో యడ్లపాడు ఎస్సై శ్రీహరి దాడి చేసి పట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ నుంచి యడ్లపాడుకు చెందిన ముగ్గురు యువకులు అజయ్, రవికిరణ్, శ్రీరాములు మద్యం తీసుకొచ్చి.. విక్రయిస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టారు. నిఘా ఉంచిన పోలీసులకు శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందడంతో.. దాడి చేసి 644 క్వార్టర్, 24 ఫుల్ బాటిల్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details