గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని సంగం గోపాలపురం గ్రామంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 64 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ పౌరసరఫరాల అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం ఇంటిని కోళ్లమూడీ నరేంద్ర బాబు అద్దెకు తీసుకున్నాడు. అందులో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు ఉప తహసీల్దార్ శ్రీనివాస శర్మ తెలిపారు. నిల్వ చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అధిక ధరకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 64 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత - సంగం గోపాలపురం వార్తలు
గుంటూరు జిల్లా సంగం గోపాలపురం గ్రామంలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 64 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్, పౌరసరఫరాల అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిల్వ చేసిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

అక్రమంగా నిల్వ ఉంచిన 64 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
సంఘటనా స్థలంలో ఉన్న నిందితుడు నరేంద్రబాబు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని చిలకలూరిపేట పౌరసరఫరాల గోదాంకు తరలించారు. డిప్యూటీ కలెక్టర్ కుమార్, కొండవీడు వీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి