ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత - గుంటూరులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వార్తలు

గుంటూరు సంపత్ నగర్​లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 18 టన్నుల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా.. స్వాధీనం చేసుకున్నారు.

Seizure of illegally moving ration rice
అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Jan 3, 2021, 5:01 PM IST

గుంటూరు సంపత్ నగర్​లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రెండు ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూపీ లాగటంతో గోదాములో నిల్వ ఉంచిన బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గోదాముల్లో నిల్వ చేసి.. మిల్లులకు విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు గుంటూరు డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని డీఎస్పీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details