ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 7:30 PM IST

ETV Bharat / state

250 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో రియల్ ఎస్టేట్ వెంచర్ లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 250 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

250 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
250 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా యడ్లపాడు మండల పరిధిలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. మండల పరిధిలోని బోయపాలెం వద్ద గుంటూరుకు చెందిన పోలీసులు అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అదే ఇంటిలో గతంలోనూ రేషన్ బియ్యం పట్టుబడటం చర్చనీయాంశమైంది.

పౌరసరఫరాల శాఖకు అప్పగింత..

చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో యడ్లపాడు పోలీసులు బస్తాల్ని స్వాధీనం చేసుకుని పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేశారు. యడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన రేషన్ బియ్యాన్ని అక్రమ వ్యాపారం చేస్తున్న సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ రేషన్ బియ్యం కాకినాడ తరలిస్తుండగా తణుకు వద్ద, గుంటూరు సమీపంలోని ఏటుకూరి వద్ద సుమారు వెయ్యి బస్తాలను పోలీసులు పట్టుకున్నారు.

కఠిన చర్యలు చేపడతాం : పోలీసులు

ఓ పార్టీకి చెందిన వ్యక్తితో సుబ్బారావు రేషన్ మాఫియాను పెద్ద ఎత్తున నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి:

పట్టాలెక్కుతున్న జన జీవితం..పుంజుకుంటున్న కార్యకలాపాలు

ABOUT THE AUTHOR

...view details