ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.14 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం - Seized of illicit gutka worth Rs 14 lakh

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్ లో ఓ వ్యక్తి నుంచి 14 లక్షల రూపాయల విలువైన 56 సంచుల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Seized of illicit gutka worth Rs 14 lakh
రూ.14లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం

By

Published : Sep 9, 2020, 10:43 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రకాష్ నగర్ లోని రిక్షా సెంటర్ లో భారీగా నిషేధిత గుట్కా పట్టుబడింది. పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకుని భారీగా గుట్కా నిల్వలు ఉంచి విక్రయిస్తున్నాడన్న పక్కా సమాచారంతో రెండో పట్టణ పోలీసులు బుధవారం తెల్లవారుజామున సోదాలు చేశారు.

14 లక్షల రూపాయలు విలువ చేసే 56 సంచుల నిషేధిత గుట్కాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగుళూరు నుంచి గుట్కా సంచులు తీసుకువచ్చానని చెప్పినట్లు సిఐ పి.కృష్ణయ్య వివరించారు. అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details