గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలో రొంపిచర్ల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. రూ.40వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వినుకొండకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - illegal gutkha seized news in rompicherla
రూ.40 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని రొంపిచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినుకొండకు చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు.
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం