Land occupation: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వర్లు.. పంచాయతీకి సంబందించిన నిధులు, ఖర్చుల విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా కోరాడు. అది జీర్ణించుకోలేకపోయిన గ్రామ కార్యదర్శి.. మురుగు వాసన వస్తుందన్న నెపంతో వారి మరుగుదొడ్డి పడగొట్టి ఆ స్థలం పంచాయతీకి సంబంధించిందని బోర్డు పెట్టినట్లు బాధితులు కొలసాని హనుమంతురావు, కొలసాని వెంకటేశ్వర్లు తెలిపారు. విషయం తెలుసుకుని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి మాకినేని పెద రత్తయ్యలు అక్కడకు చేరుకున్నారు. వైకాపా నాయకులు కక్ష పూరితంగా ఇలా చేస్తున్నారని.. దీనిపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఎప్పటినుంచో నివసిస్తున్న వారి ఇళ్లకు నోటీసులు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఈ అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ వేస్తామని తెలిపారు.
ఆ వివరాలు అడిగారని మరుగుదొడ్డిని కూల్చేశారు... అంతటితో ఆగకుండా.. - guntur district
Land occupation: రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో ఓ ఇంటి మరుగుదొడ్డిని పడగొట్టారు. అంతేగాకుండా ఆ స్థలం పంచాయతీకి సంబంధించినదిగా బోర్డు పెట్టారు. పంచాయతీకి సంబందించిన వివరాలను సమాచార హక్కు చట్టంలో అడిగినందుకే ఈ చర్యకు పాల్పడ్డారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
secretary-land-encroachment