గుంటూరు జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహ.. ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నరసరావుపేట డివిజన్ లో రెండోదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా జరుగుతున్నాయని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని సాతులూరు పంచాయితీ పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అలాగే జొన్నలగడ్డ పోలింగ్ కేంద్రం, అనంతరం రొంపిచర్ల మండలంలోని అన్నారం పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల కేంద్రాలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఓటర్లు కూడా ప్రశాంతంగా ఓట్లు వేయాలని సూచించారు. ఎవరైనా పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా రెండవ దశ పంచాయతీ ఎన్నికలు - గుంటూరు జిల్లాలో రెండోదశ పంచాయతీ ఎన్నికలు
గుంటూరు జిల్లాలో రెండవ దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చెలరేగుతున్నప్పటికి.. పోలీసులు ఈ వివాదాలను అదుపు చేస్తున్నారు.

నకరికల్లులో పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికేతర వైకాపా నేతలు పోలింగ్ కేంద్రంలోకి రావడంతో వివాదం ఏర్పడింది. తెదేపా మద్దతుదారులు.. వైకాపా వారు రావటం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసులు వెంటనే స్పందించటంతో గొడవ సద్దుమణిగింది. నకరికల్లు పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ సందర్శించి వెళ్లిన కాసేపటికే ఈ వివాదం జరిగింది.
ఇదీ చదవండీ...జగన్‌పై కేసు ఉపసంహరణ కోసం పిటిషన్