ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి: జేసీ ప్రశాంతి - గుంటూరులో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి.. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు రిజిస్టర్ చేసుకోవాలని.. జిల్లా జేసీ ప్రశాంతి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యి వ్యక్తిగత వివరాలు అందించి.. టీకా తీసుకునే ప్రదేశం, తేదీ, సమయం ముందస్తుగానే స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని తెలిపారు.

second phase of corona vaccination started in guntur
రెండో విడత వ్యాక్సినేషన్ కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి: జేసీ ప్రశాంతి

By

Published : Mar 3, 2021, 7:20 AM IST

Updated : Mar 3, 2021, 11:20 AM IST

గుంటూరు జిల్లాలో కోవిడ్‌–19 వాక్సినేషన్‌ వేయించుకోవడానికి.. 60 సంవత్సరాలు వయస్సు దాటిన వారు, 45 నుంచి 59 సంవత్సరాలు వయస్సు ఉండి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా సంయుక్త పాలనాధికారి పి.ప్రశాంతి తెలిపారు.

చరవాణిలో లాగిన అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్యశ్రీ నెటవర్క్‌ ఆసుపత్రుల్లో టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని, టీకా పొందేందుకు లబ్దిదారుడు తన పేరుతో లింక్‌ చేయబడిన మొబైల్‌ నెంబర్‌ ద్వారా కోవిన్‌ యాప్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌ లేదా cowin.gov.in కి లాగిన్‌అయ్యి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెప్పారు.

ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలి

రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యి వ్యక్తిగత వివరాలు అందించి.. టీకా తీసుకునే ప్రదేశం, తేదీ, సమయం ముందస్తుగానే స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తదుపరి మొబైల్‌ నెంబర్‌కు వచ్చే సంక్షిప్త సమాచారం ద్వారా ఎంపిక చేసుకున్న కోవిడ్‌–19 వాక్సినేషన్‌ కేంద్రంలో టీకా పొందవచ్చని చెప్పారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా టీకా

ప్రభుత్వ ఆస్పత్రులలో టీకా ఉచితంగాను, ఆరోగ్యశ్రీ నెటవర్క్‌ ఆస్పత్రుల్లో.. టీకా ఖరీదు రూ.150, సర్వీస్‌ చార్జీ రూ.100 కలిపి రూ.250 చెల్లించి టీకా పొందవచ్చన్నారు. ఒకసారి మొదటి డోసు పొందిన లబ్దిదారుడు రెండవ డోసు టీకా వేసుకొనవలసిన సమాచారం ముందస్తుగా.. తేది, వాక్సినేషన్‌ కేంద్రం వివరాలు మొబైల్‌ నెంబర్‌ కు వెళ్తుందని తెలిపారు.

సందేహాల నివృత్తి కోసం సచివాలయంలోని ఏఎన్‌ఎంలను సంప్రదించండి

రిజిస్ట్రేషన్‌కు, ఇతర సందేహాల నివృత్తి కోసం సచివాలయంలోని ఏఎన్‌ఎంలను సంప్రదించి సహాయం పొందవచ్చాన్నారు. ఇప్పటి వరకు కోవిడ్‌ –19 వాక్సినేషన్‌ టీకాలు తీసుకోని ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ వెంటనే టీకాలు వేయించుకోవాలని తెలిపారు.

వ్యాధిని అరికట్టేందుకు అందరూ సహకరించాలి

కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని.. పూర్తిగా ముప్పు తొలగలేదని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని, చేతులు తరచు శానిటైజేషన్‌ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని జేసీ ప్రశాంతి తెలిపారు.

ఇదీ చదవండి:

'అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనకు ప్రయత్నాలు'

Last Updated : Mar 3, 2021, 11:20 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details