ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MPP Elections: దుగ్గిరాలలో ఎన్నికల వేళ.. వారికి భద్రత కల్పించాలి: ఎస్​ఈసీ - ap latest news

MPP Elections: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ ఎన్నిక వేళ.. తెదేపా, జనసేన ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. 5వ తేదీన తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరనున్న ఎంపీటీసీలకు భద్రత కల్పించాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

SEC on Duggirala MPP Elections
దుగ్గిరాలలో ఎన్నికలు

By

Published : May 4, 2022, 10:09 AM IST

MPP Elections: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ మెంబర్ ఎన్నిక వేళ.. తెదేపా, జనసేన ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. గురువారం (మే 5) దుగ్గిరాల మండలం ఎంపీపీ ఎన్నిక రీత్యా భద్రత కల్పించాలని డీఎస్పీని కోరినా స్పందన లేకపోవడంతో తెదేపా, జనసేన ఎంపీటీసీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఇటీవల నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​పై వైకాపా రాళ్ల దాడి, జరుగుతున్న పరిణామాలు, వేధింపుల నేపథ్యంలో.. 5వ తేదీన జరిగే ఎన్నికలో అధికార పార్టీకి చెందిన గూండాల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎంపీటీసీలు లేఖలు రాశారు. 5వ తేదీన తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరనున్న ఎంపీటీసీలకు భద్రత కల్పించాలంటూ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details