ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​ఈబీ సూపరింటెండెంట్​పై వేధింపుల ఆరోపణలు.. కొట్టిపారేసిన అధికారి!

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం విషయంపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్​ఈబీ) సూపరింటెండెంట్ బాలకృష్ణన్ స్పందించారు. ఎస్సై గీత చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తానూ ఏ తప్పు చేయలేదని... తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు.

seb superintendent balakrishnan about women si allegations on him
seb superintendent balakrishnan about women si allegations on him

By

Published : Sep 12, 2020, 6:20 PM IST

Updated : Sep 12, 2020, 6:54 PM IST

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్​ఐ గీత చేసిన ఆరోపణలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వివరణ ఇచ్చారు. ఎస్‌ఐ గీతపై లైంగిక వేధింపులు చేశాననే ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఏ తప్పు చేయలేదని.. వ్యక్తిగత ఆరోపణలు తగదన్నారు. పని ఒత్తిడి కారణంగానే తనపై ఆరోపణలు చేస్తోందని బాలకృష్ణన్‌ స్పష్టం చేశారు.

నన్ను సస్పెండ్ చేయలేదు.. సరెండర్ మాత్రమే చేశారు. ఇప్పటివరకు నాపై వచ్చిన ఆరోపణలన్నీ ప్రేరేపితమైనవే. విచారణ కమిటీ ఎదుట అన్నీ స్పష్టంగా చెబుతా. విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

-బాలకృష్ణన్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్

  • అసలేం జరిగిందంటే..?

రెండ్రోజుల క్రితం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల వేధింపులే కారణమని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి:నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

Last Updated : Sep 12, 2020, 6:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details