ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్లిపాలెంలో 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - కల్లిపాలెంలో ఎస్​ఈబీ అధికారుల దాడులు

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కల్లిపాలెంలో ఎస్​ఈబీ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. సుమారు 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

seb
కల్లిపాలెంలో ఎస్​ఈబీ అధికారుల దాడులు

By

Published : May 20, 2021, 5:55 AM IST

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కల్లిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లో ఎస్​ఈబీ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములు, సారా తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

తీర ప్రాంతాల్లో పెరుగుతున్న అనధికార సారా తయారీ అమ్మకాలను అరికట్టేందుకు నిత్యం దాడులు నిర్వహిస్తూనే ఉంటామని ఎస్సై గీతిక తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు, నాటు సారా తయారీవంటి ఘటనలకు పాల్పడితే.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details