గుంటూరు జిల్లాలో ఎస్ఈబీ అధికారులు తలపెట్టిన స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వీక్‌లో భాగంగా.. సోమ, మంగళ వారాల్లో గుట్కా, ఖైనీ వంటి నిషేధిత పదార్థాలు తయారీ, సరఫరా, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశించారు. బుధ, గురువారాల్లో పేకాట, కోడి పందాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని.. శిబిరాలపై దాడులు నిర్వహించాలన్నారు. శుక్ర, శని వారాల్లో ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలపై దృష్టి సారించాలని పోలీస్ అధికారులకు తెలిపారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కుపాదం - ఈరోజు స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వీక్ తాజా వార్తలు
గుంటూరు రూరల్ జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని.. ఎస్పీ విశాల్ గున్నీ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ వారాన్ని స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వారంగా ప్రకటించి.. ప్రత్యేక దాడులు నిర్వహించాలని సూచించారు.
ఎస్పీ విశాల్ గున్ని
ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అధికారి, స్థానిక ఎస్ఈబీ అధికారుల సమన్వయంతో తమ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న నేరుగా తన ఫోన్ నంబర్‌కి గానీ, రూరల్ జిల్లా వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 88662 68899కి లేకుంటే డయల్ 100కి సమాచారం ఇవ్వాలన్నారు.
ఇవీ చూడండి...