లాక్డౌన్ అనంతరం రైళ్ల రాకపోకలతో గుంటూరు రైల్వే స్టేషన్ కళకళలాడుతోంది. సోమవారం రాత్రి గుంటూరు రైల్వే స్టేషన్కు ఫలక్నుమా, గోల్కొండ ఎక్స్ప్రెస్లు చేరుకున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం... అధికారులు జిల్లాకు చేరుకున్న ప్రయాణికుల వివరాలు సేకరించి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్, సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ స్టేషన్లో పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
గుంటూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు - ప్రయాణికులకు గుంటూరు రైల్వే స్టేషన్లో స్కీనింగ్
ప్రయాణికుల రాకపోకలతో గుంటూరు రైల్వే స్టేషన్ కళకళలాడుతోంది. వివిధ చోట్ల నుంచి జిల్లాకు చేరుకున్న ప్రయాణికులకు అధికారులు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
![గుంటూరు రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు screening tests for passengers in guntur railway station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7439932-854-7439932-1591069300312.jpg)
గుంటూరుకు రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు