గుంటూరు నగరపాలక సంస్థ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాచ్ అవార్డుకు ఎంపికైంది. చెక్కలో నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇంధనం తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు ఈ అవార్డు దక్కింది. దేశంలో మూడు కార్పోరేషన్లు ఈ కేటగిరిలో అవార్డులు సాధించగా.. అందులో గుంటూరు నగరపాలక సంస్థ ఒకటి. ఈ ప్లాంటులో రోజుకు 500 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా.. 230 లీటర్ల ఇంధనం తయారు చేస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించటంతో పాటు.. జీరో వేస్టేజ్ విధానంలో ఈ ప్లాంట్ పనిచేస్తున్నట్లు కమిషనర్ అనురాధ తెలిపారు. ఇదే ఉత్సాహంతో 2021 స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో మంచి ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అవార్డుకు ఎంపికైనందుకు జీఎంసీ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, కమిషనర్ అనురాధలు హర్షం వ్యక్తం చేశారు.