గుంటూరు జిల్లా రావెలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరసనకు దిగారు. కులం పేరుతో ప్రధానోపాధ్యాయుడుతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు దూషిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. నిరసనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
'ఉపాధ్యాయులు కులం పేరుతో దూషిస్తున్నారు' - Abuse with cast
కుల రహిత సమాజం కోసం ఎలా పోరాడాలో చెప్పాల్సిన ఉపాధ్యాయులే...కులం పేరుతో దూషిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రావెల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.
ఉపాధ్యాయులు కులం పేరుతో దూషిస్తున్నారు