2011లో ఒకటి... 2015లో మరొకటి... 2019లో ఇంకొకటి ఏంటని అనుంటున్నారా.. ఓ ప్రధానోపాధ్యాయుడు చేసుకున్న పెళ్లిళ్లు. అవును కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగింది ఈ ఘటన. శీలం సురేష్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. 2011లో గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్న సురేష్... 2015లో ఉయ్యూరుకు చెందిన మరో యువతికి మూడు ముళ్లు వేశాడు. 2019లో విశ్వనాథపల్లికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. విశ్వనాథపల్లికి చెందిన బాధితురాలి ఫిర్యాదుతో ఈ నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. కేసు నమోదు చేసిన దిశా పోలీస్ స్టేషన్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువతులను వివాహం చేసుకొని మోసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని మహిళాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు - ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు న్యూస్
అతడో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు... నిత్య పెళ్లికొడుకులా మారాడు. ఒకరికి తెలియకుండా మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇలా ముగ్గురు యువతులను మోసం చేశాడు. చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో అతగాడి లీలలు బయటపడ్డాయి.
మూడు పెళ్లిల్లు చేసుకున్న ప్రధానోపాధ్యాడు