ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. అందులో భాగంగానే పాఠశాల పనితీరును పరిశీలిస్తున్నామని విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ చిన్న వీరభద్రుడు అన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విట్టల్ సెల్వి, ఆర్జేడీ రవీంద్రారెడ్డి, డీఈవో గంగాభవానితో కలిసి ఆయన పరిశీలించారు. కరోనా, వేసవి సెలవుల దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
'ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ అమలుకు నిర్ణయం' - School Education Commissioner China Veerabhadrudu
ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్ చిన్న వీరభద్రుడు అన్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు
సర్వ శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ సెల్వి.. పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఇంగ్లీష్‌పై అవగాహన కల్పించిన సెల్వి.. భాషపై పట్టు సాధించాలని సూచించారు.
ఇదీ చూడండి:ఎస్ఈసీ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ చేసిన హైకోర్టు