గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం విషాదాలలోని డ్వాక్రా మహిళలకు చెందిన శ్రీనిధి నిధుల్లో గోల్మాల్ జరిగింది. గ్రామంలో 60 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీ.వీ శ్రీనిధి పేరిట లావాదేవీలు జరుగుతుంటాయి. గ్రామానికి చెందిన ఎస్ఏజీ ఆధార్‌కు... శ్రీనిధి ఖాతా లింకైంది. దీని ద్వారా సుమారు 1,90,000 మాయమైనట్లు మహిళలు గుర్తించారు. నిధులు మాయం అవడానికి ఎస్ఏజీ పాత్ర ఉందని తెలుసుకున్న డ్వాక్రా మహిళలు...ఎస్ఏజీ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎస్ఏజీ తిరిగి డబ్బులు చెల్లించింది. శ్రీనిధి నిధులు ఖాతా ఎస్ఏజీ ఆధార్‌కు ఎలా లింక్ అయిందని తెలుసుకునేందుకు...అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
డ్వాక్రా మహిళలకు చెందిన శ్రీనిధి నిధుల్లో గోల్మాల్ - gunturu district news todsy
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విషాదాలలోని డ్వాక్రా మహిళలకు చెందిన శ్రీనిధి నిధుల్లో గోల్మాల్ జరిగింది. సుమారు 1,90,000 మాయమైనట్లు మహిళలు గుర్తించగా..వాటిని ఓ వ్యక్తినుంచి వసూలు చేశారు.

డ్వాక్రా మహిళలకు చెందిన శ్రీనిధి నిధుల్లో గోల్మాల్