తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల జరిగిన కోడెల వర్థంతి సభలో హోంమంత్రి మేకతోటి సుచరితనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వైకాపాకు చెందిన న్యాయవాది వేముల ప్రసాద్ గుంటూరులోని అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అరండల్ పేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి తో పాటు ఐపీసీ 505(2), 509, 294(B) సెక్షన్ల కింద కేసు నమోదు. అయ్యన్నపై ఇప్పటికే నకరికల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
AYYANNA: అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. - latest news in guntur
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. అలాగే 505(2), 509, 294(బి) సెక్షన్ల కింద గుంటూరులోని అరండల్‌పేటలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
Last Updated : Sep 24, 2021, 10:06 AM IST