ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత బహుజన ఐకాస డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో దళిత బహుజన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా మినహా అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ నేతలు హాజరయ్యారు.
రేపు, ఎల్లుండి రాజధాని రైతులు నిర్వహించే ఆందోళనల్లో దళిత బహుజన ఐకాస నేతలు పాల్గొనాలని నిర్ణయించారు. రైతులు చేపట్టే ఉద్యమానికి అండగా నిలవాలని ఈ సమావేశంలో తీర్మానించారు.