గుంటూరు సర్వజన ఆసుపత్రిలో కరోనా విధుల్లో ఉన్న సిబ్బందికి భారతీయ స్టేట్ బ్యాంక్ తరుపున పీపీఈ కీట్లు అందజేశారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద వీటిని అందజేసినట్లు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.ప్రేమ్ జీ తెలిపారు. రేయింబవళ్లు ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న సిబ్బందిని ప్రేమ్ జి అభినందించారు. తమ ప్రాణాలు సైతం లెక్కించక, విధులను నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది త్యాగం మరువలేమన్నారు. 5 లక్షల రూపాయల విలువ గల 900 పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కిట్లను అందించినందుకు స్టేట్ బ్యాంక్ అధికారులకు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
5 లక్షల విలువగల 900 పీపీఈ కీట్లు పంపిణీ - sbi distributed ppe kits to guntur hospital
కరోనా విధుల్లో ఉన్న గుంటూరు సర్వజన ఆసుపత్రి సిబ్బందికి భారతీయ స్టేట్ బ్యాంక్ వారు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు అందజేశారు. 5 లక్షల రూపాయల విలువగల 900 పీపీఈ కిట్లు పంపిణీ చేశారు.
5 లక్షల విలువగల 900 పీపీఈ కీట్లు పంపిణి