గుంటూరు జిల్లా తాడికొండలో ఎస్బీ ఏఎస్ఐగా పనిచేస్తున్న తోకల శివయ్య (50) మృతి చెందారు. ఇటీవల కరోనా సోకిన ఏఎస్ఐ.. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఎన్నారై ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. జిల్లాలోని చుట్టుగుంటకు చెందిన శివయ్య.. 1990లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు.
మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, గుంటూరు, మంగళగిరి, తుళ్లూరులో పనిచేశారు. మరణానికి ముందు వరకూ తాడికొండలో పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీపీఐ మండల కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్ రావు, సీపీఎం మండల కార్యదర్శి చింతల భాస్కర్‌రావు మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. శివయ్య అంత్యక్రియల్లో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.