మహానటి సావిత్రి జయంతిని... ఆమె స్వగ్రాంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రి నిర్మించిన పాఠశాలలో జయంతి జరిగింది. స్కూళ్లోని ఆమె విగ్రహానికి విద్యార్థులు, గ్రామస్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాభివృద్ది కోసం సావిత్రి చేసిన కృషి గురించి ఊపాధ్యాయులు... విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత కమతం సాంబశివరావు పాల్గొన్నారు. సావిత్రి సమాజసేవను కొనియాడారు. తీర ప్రాంతంలో విద్యార్థులకు చదువు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని వివరించారు.
'మానవసేవకు ప్రతిరూపం మహానటి సావిత్రి' - మహానటి సావిత్రి జయంతి వేడుక
మహానటి సావిత్రి జయంతిని తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డేవారిపాలెంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిగణేషన్ ఉన్నత పాఠశాలలోని మహానటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పూలమాలలు వేసిన గ్రామస్ఖులు