Donation For Nadu Nedu Scheme: నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మా స్యూటికల్ తయారీ, బయోటెక్ కంపెనీ లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లు విరాళం ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణ చావా, అధికారులు డీడీ అందజేశారు. రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి నిధులను వెచ్చించాలని సీఎంను కోరారు. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలిన గాయాలకు సంబంధించి అధునాతన, అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వార్డు నిర్మాణానికీ రూ.5 కోట్లు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సత్యనారాయణ చావా సీఎంకు తెలిపారు.
నాడు-నేడు పథకానికి లారస్ ల్యాబ్స్ రూ. 4 కోట్లు విరాళం - సీఈవో సత్యనారాయణ చావా ప్రభుత్వానికి 4 కోట్ల విరాళం
Laurus Labs Donation For Nadu Nedu : రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి నిధులను వెచ్చించాలని కోరుతూ నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మా స్యూటికల్ తయారీ, బయోటెక్ కంపెనీ లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లు విరాళం ఇచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణ చావా, అధికారులు డీడీ అందజేశారు.
నాడు నేడు పథకానికి 4 కోట్లు విరాళం