ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లి ఠాణా వద్ద మృతుడి బంధువుల ఆందోళన: ఎస్ఐపై వేటు - సత్తెనపల్లి ఎస్ఐ సస్పెండ్

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్​స్టేషన్ వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లే గౌస్​ మరణించాడని.. వ్యక్తిని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఐజీ ప్రభాకర్‌రావు ఘటనపై ఆర్డీవోతో మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

sattenapalli SI Suspended By higher Officials
సత్తెనపల్లి ఠాణా వద్ద ఆందోళన: ఎస్ఐ సస్పెండ్

By

Published : Apr 20, 2020, 1:45 PM IST

Updated : Apr 20, 2020, 1:54 PM IST

సత్తెనపల్లి ఠాణా వద్ద ఆందోళన: ఎస్ఐ సస్పెండ్

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి ఘటన దురదృష్టకరమని ఐజీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. షేక్ గౌస్ అనే వ్యక్తిని ఆపేందుకు ఎస్ఐ రమేశ్‌బాబు ప్రయత్నించారని ఐజీ వివరించారు. అప్పటికే అతడికి చెమటలు పట్టి కింద పడిపోయాడని చెప్పారు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారన్న ఐజీ... చికిత్స పొందుతూనే అతను మరణించాడని తెలిపారు.

చనిపోయిన వ్యక్తికి హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయన్న ఐజీ... మృతదేహంపై గాయాలు పెద్దగా లేవని చెప్పారు. ఈ ఘటనపై ఆర్డీవోతో మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామన్నారు. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్న ఐజీ ప్రభాకర్‌రావు... సత్తెనపల్లి ఎస్ఐ రమేశ్‌బాబును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కోరారు. లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఐజీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... లాక్​డౌన్: లాఠీ దెబ్బలకు వ్యక్తి మృతి

Last Updated : Apr 20, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details