Santabiotech Founder K. Varaprasad Reddy: గుంటూరు జిల్లా నంబూరులోని వీవీఐటిలో మూడు రోజులపాటు జరిగిన యువజనోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. ఇవాళ్టి ముగింపు కార్యక్రమానికి శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డికి జీవనసాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్యాంప్రసాద్ రెడ్డి.. నేటితరం యువత మంచి నాయకులుగా తయారు కావాలన్నారు.
ఎంతో సుసంపన్నమైన తెలుగు భాషను మర్చిపోవద్దని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గురించి కనీసం తెలుసుకోవాలన్నారు. అప్పుడే మంచి పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విదేశీ కంపెనీలకు మంచి సాఫ్ట్వేర్లు మన భారతీయులు తయారు చేస్తుంటే.. వారు మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారని.. అవి మన వద్దే తయారైతే తక్కువ ఖర్చుతో మంచి సాంకేతికతను దేశానికి అందించవచ్చని అభిప్రాయపడ్డారు.